ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. కాగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అంతే కాంకుడా హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్ లలో ఆస్పత్రిని నిర్మించలేరా? అంటూ మరో ప్రశ్నవేసింది. హైకోర్టు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరారు.