గత ఎన్నికల ముందు మద్యం వల్ల అనేక కుటుంబాల పడుతున్న బాధని చూసిన జగన్ అధికారంలోకి రాగానే, దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్లకు తాను అండగా నిలబడతానని చెప్పారు. అయితే జగన్ చెప్పిన విధంగానే అధికారంలోకి రాగానే, మద్యపాన నిషేధం హామీపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే బెల్ట్ షాపులు మూయించేశారు. అలాగే మద్యం షాపులని నిర్వహించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. వైన్ షాపులని చాలా వరకు తగ్గించేసింది.