తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కొత్తగా పీసీసీ బాధ్యతలు తీసుకున్న రేవంత్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. పదవి వచ్చినంత సులువుగా పార్టీని లైన్లో పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ చాలా గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది. ఆ పరిస్తితుల నుంచి రేవంత్, కాంగ్రెస్‌ని బయటపడవేయాల్సిన అవసరముంది.