కడప పార్లమెంట్.. ఈ పేరు చెప్పగానే వైఎస్సార్ కుటుంబమే గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే, అక్కడ ఆ పార్టీ సత్తా చాటుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న సమయంలో కడప పార్లమెంట్లో టీడీపీ జెండా ఎగరలేదు. కేవలం ఒకే ఒకసారి అంటే 1984లో మాత్రమే కడపలో టీడీపీ గెలిచింది. అక్కడ నుంచి వైఎస్సార్ నాలుగుసార్లు కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు గెలిచారు. జగన్ సైతం 2009లో కాంగ్రెస్ తరుపున కడప ఎంపీగా గెలిచారు.