బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మరణానికి అందరూ నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆయన లేని లోటు తీర్చలేమని ట్వీట్ చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిలీప్ కుమార్ సినీరంగానికి చేసిన సేవను కొనియాడారు. అయితే ఆయన మరణంపై ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దిలీప్ కుమార్ మతాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నేత అరుణ్ యాదవ్ వేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సోషల్ మీడియాలో బీజేపీని కార్నర్ చేసింది.