తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ భారీ వర్షాలతో కోతకు గురైన సముద్ర ప్రాంతాన్ని పరిశీలించేందుకు తిరువల్లూరు జిల్లా లో పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి బోటు ఎక్కాల్సి వచ్చింది. అయితే బోటు ఎక్కే ప్రాంతంలో నీరు ఉండటంతో మంత్రి చిరాకు పడ్డారు. నీళ్లలో తడిస్తే ఆయన ఖరీదైన బూట్లు పాడవతాయని భావించాడు. దాంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు మంత్రి కాలికి మట్టి అంటకుండా భుజాలపై వేసుకొని తీసుకువెళ్లి పడవలో ఎక్కించాడు. అలా మంత్రి పడలో చక్కర్లు కొట్టారు. తర్వాత మళ్ళీ తిరిగి బయటకు వచ్చే సమయంలో కూడా బోట్ దిగేందుకు కాస్త ఆలోచించాడు. దాంతో దిగేటప్పుడు కూడా మత్స్యకారుడు మంత్రిని ఎత్తుకొని మళ్లీ అడుగు కింద పెట్టుకుండా ఒడ్డుమీద వదిలిపెట్టాడు. దీనిని సంబంధించిన వీడియోను స్థానిక మీడియా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.