తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని నెలల ముందు వరకు కేసీఆర్‌ని ఢీకొట్టే ప్రతిపక్షం లేదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బీజేపీ పుంజుకోవడం, టీపీసీసీ పగ్గాలు రేవంత్‌కు అప్పగించడంతో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి పెరిగింది. ఊహించని విధంగా ఏపీ సీఎం జగన్ సోదరి, దివంగత నేత వైఎస్సార్ కుమార్తె షర్మిల సైతం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్నారు.