ఎన్నికల్లో భారీ మెజారిటీలతో ఓడిపోతే నాయకులకు ఒకరకమైన బాధ ఉంటుంది. సరే ప్రజలు తనని వద్దు అనుకున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ మరి తక్కువ మెజారిటీతో ఓడిపోతే ఆ నాయకుడి బాధ వర్ణాతీతం. గెలుపు దగ్గరకు వచ్చి బోల్తా కొడితే ఆ నాయకుడుకు ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలా తక్కువ మెజారిటీతో ఓడిపోయిన నాయకులు, ఇంకా కసితో పనిచేస్తారు. అలాగే వారిపై సానుభూతి కూడా ఉంటుంది. మళ్ళీ మంచి మెజారిటీతో గెలవాలని ప్రయత్నిస్తారు.