ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని గతంలో టీడీపీ నేతలు పలు మార్లు ఆరోపణలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని టీడీపీ పలుమార్లు విమర్శలు గుప్పించింది. తాజాగా ఇదే బాటలో పీఏసీ చైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు.