తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇదే కోవలో షర్మిల కూడా యాత్ర చేస్తారనే సమాచారం ఉంది. గతంలో కూడా తెలంగాణలో షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఆమె మరోసారి తెలంగాణలో పాదయాత్ర చేస్తే, వైఎస్ఆర్ అభిమానులంతా వైఎస్సార్ తెలంగాణ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో కేటీఆర్ ఈ యాత్రలన్నిటినీ కామెడీ చేస్తూ మాట్లాడారు. పాదయాత్రలతో ఆరోగ్యం వస్తుంది కానీ, అధికారం రాదని తేల్చేశారాయన.