కృష్ణా బోర్డ్ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ వాయిదా ఒకరకంగా ఏపీకి నిరాశ కలిగించే అంశం. ఇప్పటికే కృష్ణా నదినుంచి తెలంగాణ నీటిని వృథా చేస్తోంది, రోజుకి 4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో వృథాగా కిందకు వదిలేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కృష్ణాబోర్డ్ సహా, కేంద్రల జలశక్తి మంత్రికి, ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఏపీ తరపున లేఖలు వెళ్లాయి. ఇందులో మొదటి విచారణ కృష్ణాబోర్డ్ పరిధిలో జరగాల్సి ఉండగా.. ఆ మీటింగ్ వాయిదా పడటం విశేషం. మొదటినుంచీ మీటింగ్ వాయిదా వేయాలని కోరుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో తన పంతం నెగ్గించుకున్నారు.