మనదేశంలోని కేరళ రాష్ట్రంలో తొలిసారిగా ఈ జికా వైరస్ కేసు వెలుగు చూసింది. ఆ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. అంతే కాదు.. తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయట. ఇవి ఇంకా నిర్థారణ కావాల్సి ఉంది.