తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వచ్చే అవకాశాలు లేవని ఆ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు అంటున్నారు. ఒకవేళ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో థర్డ్ వేవ్ వచ్చినా.. దాని ప్రభావ తీవ్రత తక్కువగానే ఉంటుందని స్పష్టం చేశారు.