తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ తనయురాలు షర్మిల ఎంట్రీ ఇచ్చి, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పేరుతో షర్మిల సరికొత్త పార్టీని పెట్టారు. ఇక పార్టీ పెట్టడమే ఆలస్యం, తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై కూడా ఆమె స్పందించారు.