టీపీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి...తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా కేసీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకుంటామని రేవంత్ చెబుతున్నారు. ఇక కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి రేవంత్ ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.