రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఇల్లు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్, దాదాపు 30 లక్షల పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే జగన్న కాలనీలు పేరిట కూడా ప్రభుత్వం ఇళ్ళు కట్టిస్తానని చెప్పింది. కానీ ఆ విషయంలో జగన్ ప్రభుత్వం లబ్దిదారులకు హ్యాండ్ ఇచ్చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే పలు మీడియా సంస్థలు ఈ విషయంపై జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.