పిఏసి ఛైర్మన్గా పయ్యావుల కేశవ్...దాదాపు రెండేళ్ల తర్వాత స్పందించారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 41 వేల కోట్లని ఎలాంటి బిల్లులు, రశీదులు లేకుండా చెల్లింపులు చేసిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. 41 వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం నోక్కేసిందని తాము చెప్పట్లేదని, కానీ వాటికి ఎలాంటి బిల్లులు లేవని మాత్రమే అడుగుతున్నామని అన్నారు.