జనసేనని బలోపేతం చేయడంలో పవన్ ఫెయిల్ అయ్యారా? అంటే కాస్త అవుననే విశ్లేషకుల నుంచి సమాధానాలు వస్తున్నాయి. ఎందుకంటే పార్టీ పెట్టి దాదాపు 7 ఏళ్ళు దాటిన కూడా పవన్ ఇంతవరకు పూర్తి స్థాయిలో జనసేనని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టలేదని అంటున్నారు. సరే పార్టీ పెట్టిన మొదట్లో పోటీ చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి, 2014లో టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు.