సాధారణంగా జాతీయ పార్టీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆధిపత్యం పెద్దగా కొనసాగదనే చెప్పొచ్చు. పార్టీ అధిష్టానం చెప్పినట్లే అధ్యక్షులు నడుచుకోవాలి. సొంత నిర్ణయాలని తీసుకుని పార్టీని నడిపించడం సాధ్యం కాదు. కానీ గతంలో వైఎస్సార్ ఒక్కడే కాంగ్రెస్‌ని నడిపించారు. అధిష్టానానికి గౌరవం ఇస్తూనే, తన మాట మీద పార్టీ నడిచేలా చేసుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి అదే తరహా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు.