ఎర్రబెల్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూమారం లేపడంతో ఆయన మళ్లీ దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఓ మహిళా అధికారిపై ఇలా అనుచిత కామెంట్స్ చేయడం తగునా అని వస్తున్న విమర్శలకు బదులిచ్చారు. తెలంగాణ ఉచ్చారణలో మీరు బాగా పని చేస్తున్నారు. ఇంకా అందరిని ఉరికించి పని చేయించండి అంటూ ప్రొత్సహించానని వివరణ ఇచ్చారు.