ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాం అంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం వింటూనే ఉన్నాం. కరోనా కష్టకాలంలో నగదు బదిలీలతో పేదల్ని ఆదుకుంటున్న ఏపీ సీఎం జగన్, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. పథకం పేరేదయినా, నిరుపేదలకు సకాలంలో ఆర్థిక సాయం అందించడం, అది కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా అకౌంట్లలోకి డబ్బులు బదిలీ చేయడం విశేషమే. అయితే అదే సమయంలో ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం విచారకరం.