కేంద్ర మంత్రుల అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కి అత్యథికంగా అప్పులున్నట్టు తేలింది. ఆయన అప్పుల విలువ ఏకంగా రూ. 30.5కోట్లు. 11.5 కోట్ల రూపాయల అప్పుతో పీయూష్ గోయల్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. 16మంది మంత్రులు కోటి రూపాయలకన్నా ఎక్కువ అప్పులు చేశారు. వీరిలో ముగ్గురు రూ.10కోట్లకంటే ఎక్కువ రుణాలు తీసుకుని రుణగ్రస్తులయ్యారు.