సోనియాగాంధీని తెలంగాణ తల్లి అని అంటున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబుని తెలంగాణ తండ్రి అంటారని, ఆయనకింకా టీడీపీ పాత వాసనలు పోలేదని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే టీడీపీ మూలాల గురించి మాట్లాడిన కేటీఆర్ కి అదే స్థాయిలో పంచ్ లు విసిరారు రేవంత్ రెడ్డి. ఈ ఎపిసోడ్ లో టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ప్రవేశించడం విశేషం. గతంలో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు ఉన్న సందర్భంలో బాలకృష్ణ ప్రసంగిస్తుంటే, కేటీఆర్ ఫొటోలు తీస్తున్న స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. కేసీఆర్ టీడీపీ కండువా కప్పుకొని ఉన్న స్టిల్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి.