కుప్పంలో చంద్రబాబుకు భారీ షాక్ తగులనుందా? వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బాబుకు వైసీపీ చెక్ పెట్టేస్తుందా? అంటే వైసీపీ శ్రేణులు, వైసీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం అవుననే సమాధానం వస్తుంది. కుప్పం అంటే చంద్రబాబుకు కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ బాబు సొంత సామాజికవర్గం కమ్మ ఓట్లు ఎక్కువ లేకపోయినా సరే దశాబ్దాల కాలం నుంచి ఇక్కడున్న ప్రజలు బాబుకు సపోర్ట్‌గా ఉంటున్నారు. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో కుప్పం ప్రజలు బాబుని గెలిపించారు.