తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అందుకే అక్కడ టీడీపీకి మనుగడ లేకుండా పోయింది. బాబు ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసిన టీడీపీని నిలబెట్టలేకపోయారు. ఆఖరికి 2018లో బద్ధ శత్రువు కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుని బాబు ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.