ఏపీకి కొత్త గవర్నర్ రాబోతున్నారని, అది కూడా పొరుగు రాష్ట్ర సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి మరీ ఏపీకి గవర్నర్ గా రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ పదవుల్లోకి ఎవరు వస్తారు, ఎవరు వెళ్లిపోతారనే విషయం ఎప్పుడూ ఆసక్తికరం కాదు, కానీ కర్నాటక సీఎం, పదవికి రాజీనామా చేసి మరీ ఏపీ గవర్నర్ గా వస్తారనడం మాత్రం విశేషంగా మారింది.