టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి బయటకొచ్చి ఈటల రాజేందర్ కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారనుకున్న టైమ్ లో ఆయన వ్యూహం ఎలా ఉంటుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టి, కేసీఆర్ వ్యతిరేకులందర్నీ ఓ చోటకు చేర్చి టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటిస్తారని అంచనా వేశారు. అలా చేస్తే కచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని, కేసీఆర్ ని ఢీకొనే బలమైన ఉద్యమ నాయకుడు తెరపైకి వచ్చినట్టవుతుందని అనుకున్నారంతా. కానీ రోజులు గడిచే కొద్దీ ఈటల వ్యవహారం పూర్తిగా నీరుగారిపోయింది. కేసీఆర్ కి వ్యతిరేకంగా రాష్ట్రనాయకుడవుతారని అనుకున్న రాజేందర్.. గ్లలీ లీడర్ గా మారిపోయారు. కేసీఆర్ ఆయన్ను అలా మార్చేశారంతే.