ఓ తెలుగు అమ్మాయి చరిత్ర సృష్టించబోతోంది. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న భారతీయ వనితగా రికార్డులకెక్కబోతోంది. తెలుగు మూలాలున్న బండ్ల శిరీష.. మరో ఐదుగురు వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించబోతోంది.