తెలుగుదేశం...నలభై దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ.. ఎన్నో విజయాలు సాధించింది...అలాగే కొన్ని పరాజయాలు కూడా చవిచూసింది. అయినా సరే పార్టీ బలం ఎప్పుడు తగ్గినట్లు కనిపించలేదు. కానీ రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్తితికి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ఆ పార్టీ మనుగడ కష్టమైపోయింది. ఏపీలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే బలం పెద్దగా తగ్గలేదు.