మంత్రి పదవి....ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికీ ఉండే నెక్స్ట్ టార్గెట్. ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాగే మంత్రి పదవులు దక్కిన వారు సైతం, ఆ హోదాని నిలబెట్టుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఇదే పరిస్తితి ఏపీలోని అధికార వైసీపీలో ఉంది. ఎందుకంటే మరో కొన్ని నెలల్లో సీఎం జగన్ తన కేబినెట్లో మార్పులు చేయనున్నారు. కొందరు మంత్రులని పక్కకు తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు.