రాజకీయాల్లో నాయకుల పరిస్థితి బాగున్నా.. బాగాలేకున్నా.. నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితులు ప్రభావం చూపుతుంటాయి. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల లోపాలు.. నేతల వ్యవహారాలు కూడా ఒక్కొక్కసారి కలిసి వస్తాయి. వీటిని అందిపుచ్చుకుంటే.. చాలు..తాము ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదని భావించే నాయకులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నారట.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కష్టపడి పనిచేస్తున్న రాజప్ప, గత రెండు ఎన్నికల్లో వరుసగా పెద్దాపురంలో గెలుస్తూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్లో హోమ్ మంత్రిగా పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం రాజప్ప సత్తా చాటారు. కానీ అధికారంలో లేకపోవడంతో రాజప్ప సరిగ్గా పనిచేయలేకపోతున్నారు.