పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపించింది మన గుంటూరు అమ్మాయి. తల్లిదండ్రులతో పాటు అమెరికాలో స్థిరపడిన బండ్ల శిరీష.. అంతరిక్షంలోకి అడుగు పెట్టిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించింది. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగు పెట్టిన భారతీయురాలిగా గుర్తింపు పొందారు.