అకాడమీ పేరు మారిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు లక్ష్మీపార్వతి. తెలుగు అకాడమీ పేరుని తెలుగు-సంస్కృత అకాడమీగా.. విస్తరించడం వల్ల నష్టం ఏంటో విమర్శకులు వివరించాలని ఆమె అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిిని అభినందించాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు. పేరు మార్చినంత మాత్రాన ప్రమాదం లేదని చెప్పారు. గత ప్రభుత్వాలు అకాడమీని పట్టించుకోకపోయినా ఎవరూ ప్రశ్నించలేదని, జగన్ ప్రభుత్వం పేరు మార్చి మార్పుకి శ్రీకారం చుడితే మాత్రం అందరూ విమర్శలతో విరుచుకుపడుతున్నారని, అది సరైన స్పందన కాదని అన్నారు లక్ష్మీపార్వతి.