తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ తిరస్కరిస్తుందనే వార్తను తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారనేది కేవలం దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు టీటీడీ ప్రతినిధులు. గతంలో ఎలాంటి విధానం అమలులో ఉండేదో.. ఇప్పుడు కూడా దాన్నే ఫాలో అవుతున్నామని, మార్పులు చేయలేదని చెప్పారు.