షర్మిల పార్టీలో కూడా ఇప్పుడు కీలక నాయకులు లేరు. గతంలో వైఎస్సార్ హయాంలో మంత్రులుగా పనిచేసినవారు, ఆయనను అభిమానించేవారు చాలామందే ఉన్నా.. ఎవరూ షర్మిల పార్టీవైపు కన్నెత్తి చూడలేదు. కనీసం తెలంగాణ ఏర్పడ్డాక వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నవారు కూడా షర్మిల వైపుకి రాలేదు. అయితే రాబోయే రోజుల్లో షర్మిల పార్టీకి బలం పెరుగుతుందనే అంచనాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయానికి కాంగ్రెస్, బీజేపీలో ఉన్న అసంతృప్తులందరికీ షర్మిల పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని చెబుతున్నారు.