పార్టీ అధ్యక్ష పదవి పట్ల రావుల చంద్రశేఖర్ రెడ్డి అంత ఆసక్తిగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైనా దూకుడుగా వెళ్లే నేతను ,అది కూడా యువకుడిని అధ్యక్షుడిగా పెడితే బాగుంటుందని ఆయన అంటున్నారట. టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ రాజీనామాతో కొత్త అద్యక్షుడి ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టినా.. పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది.