వైఎస్ఆర్ పాలన గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడిక టీకాంగ్రెస్ అధినేతగా ఆయన గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాలి రేవంత్ రెడ్డి. కచ్చితంగా వైఎస్ పాలన స్వర్ణయుగం అని పొగడాల్సిందే. ఆ విషయంలో టీఆర్ఎస్ శ్రేణుల్ని సైతం ఎదిరించి, వైఎస్ఆర్ పై తమ పార్టీకున్న అభిమానం చాటుకోవాలి. అందులోనూ వైఎస్ఆర్ అనే పేరుతో ఉన్న ఓటుబ్యాంక్ కి షర్మిల రూపంలో మరో పెద్ద అపాయం ఎదురైంది. తెలంగాణలో వైఎస్ అభిమానులంతా షర్మిలవైపు వెళ్లకుండా కాపుకాయాలంటే.. కచ్చితంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో టీపీసీసీ ఆయన జపం చేయాల్సిందే. చంద్రబాబు అంటే విపరీతంగా ఇష్టపడే రేవంత్ కి ఇది కాస్త కష్టమైన పనే.