రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి ఇకపై వచ్చేది లేదని స్పష్టం చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో తన పార్టీ రజిని మక్కల్ మండ్రం ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ నిర్వాహకులతో చెన్నైలో జరిగిన సమావేశం అనంతరం రజినీకాంత్ ఈ ప్రకటన చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇందులో పేర్కొన్నారు. అంతేకాకుండా మక్కల్ మండ్రం అనేది ఇప్పటినుండి తన అభిమాన సంఘం గా కొనసాగుతుందని చెప్పారు.