ఏపీలో అధికార వైసీపీని ఢీకొట్టే శక్తి ప్రతిపక్ష టీడీపీకి ఉందా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితిని చూస్తే, టీడీపీకి ఆ శక్తి లేదనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ బలోపేతం కాలేదు. అదే సమయంలో వైసీపీ బలం తగ్గలేదు. అసలు చెప్పాలంటే జగన్కు ఏపీలో తిరుగులేని బలం ఉంది. ఆ బలాన్ని చంద్రబాబు తగ్గించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు.