తెలుగుదేశంలో నాయకులకు కొదవ లేదు. ఆ పార్టీలో బలమైన నాయకులు చాలామందే ఉన్నారు. వాళ్ళకు ప్రజల్లో ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు, పలువురు నాయకులు సైడ్ అయిపోయారు. అలాగే కొందరు నాయకులు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. అయితే పార్టీ మారిన వాళ్ళని వదిలేసినా, ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఇంకా యాక్టివ్ కాకపోవడం అనేది పార్టీకే పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.