ఏపీ మంత్రివర్గంలో దూకుడు కనబర్చే మంత్రుల్లో పేర్ని నాని ఒకరు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని, జగన్ కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక పేర్ని నాని ఎప్పుడు వెటకారంగా మాట్లాడుతూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టేస్తుంటారు. ఈయన ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై పలుమార్లు విమర్శలు చేశారు.