ఇప్పటికే జీతాలు ఆలస్యం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. అటు పీఆర్సీ అమలు కూడా వాయిదాలమీద వాయిదాలు పడుతూ పోతోంది. మరోవైపు సీపీఎస్ రద్దు కూడా ఎప్పుడో తెలియడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన మీడియా, సోషల్ మీడియా విభాగాల్లో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గిస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.