ఎన్నికల వేళ సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి వచ్చారు. ఇటు స్థానిక ఎన్నికల్లో బీజేపీ పరాభవం కూడా ఆయన్ను భయపెడతూనే ఉంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని సంకేతాలున్నాయి. అయితే అదే సమయంలో ప్రతిపక్షాల్లో ఉన్న అనైక్యత ఆయనకు కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ దశలో యూపీలోని మాజీ అధికారంలంతా మూకుమ్మడిగా యోగి సర్కారుపై ఆరోపణలు సంధించారు. ఉత్తర ప్రదేశ్ లో పాలన స్తంభించిందంటూ వారు బహిరంగ లేఖ రాశారు.