అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుతమైన, జీవితాంతం గుర్తుండిపోయే అద్భుత అనుభవం అంటోంది శిరీష. ఆమె ఇంకా ఏమంటోందంటే.. " నాకు ఇంకా అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. అక్కడి నుంచి భూమికి తిరిగిరావడం భలేగా ఉంది. ఈ పర్యటన అనుభూతిని వర్ణించడానికి అద్భుతం కన్నా మంచి పదం ఏదీ నాకు తట్టడం లేదు. అంతరిక్షం నుంచి భూమిని చూడటం.. వ్యోమనౌక రాకెట్ మోటారు మంటలు ఎగసిపడటం.. అనేవి నా జీవితాన్ని మార్చేసే అనుభూతులుగా చెప్పొచ్చు. ఏదేమైనా రోదసిలోకి వెళ్లి, తిరిగిరావడం నా జీవితంలోనే మర్చిపోలేని అద్భుతమైన అనుభవం " అంటూ భావోద్వేగానికి లోనైందామె.