హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా నిన్న ఎదురుకోళ్ల ఉత్సవం జరింగింది. ఈ రోజు బల్కం పేట ఎల్లమ్మ వివాహాత్సవం జరింగింది. అంతే కాకుండా రేపు రథోత్సవం జరగనుంది. ఇక బోనాల ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. బుధవారం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.