తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ వచ్చిందనే ప్రకటన రాగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంత ఉత్సాహం వచ్చిందో అందరికీ తెలిసిందే. కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు రేవంత్ రెడ్డికి పదవి రావడం ఇష్టం లేకపోయినా సరే, పార్టీ కార్యకర్తలు మాత్రం రేవంత్‌కు పదవి ఇవ్వడంపై సంతృప్తిగానే ఉన్నారు. రేవంత్ లాంటి వారికి పదవి ఇస్తే పార్టీకి బెనిఫిట్ అవుతుందని, ఇంకా పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెడతాయని అంతా అనుకున్నారు.