ఏపీలో జనసేన బలం ఎంత అంటే? ఆ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు గెలిచే బలం మాత్రమే ఉందని విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా బలపడలేదని, గత ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితిలో ఉందో, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకే ఒక సీటు వచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన ఎమ్మెల్యే సైతం తర్వాత వైసీపీ వైపుకు వెళ్లిపోయారు.