ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముగ్గురు నానీలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారా? వాళ్ళని ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగించనున్నారా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఏపీ కేబినెట్లో ముగ్గురు నానీలు మంత్రులుగా ఉన్నారు. పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)లు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ ముగ్గురు జగన్తో సన్నిహితంగానే ఉంటారు. ఇలా సన్నిహితంగా ఉండే నానీల మంత్రి పదవులు ఐదేళ్ల పాటు కంటిన్యూ అవ్వనున్నాయని తెలుస్తోంది.