కడప జిల్లా రాజంపేట పార్లమెంట్....వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వైసీపీ హవా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అయితే మొదట నుంచి రాజంపేటలో టీడీపీకి పెద్ద బలం లేదు. 1984, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఇక ఎక్కువగా కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది.