కొన్నాళ్ల క్రితం ఏపీ రాజధాని గురించి ఆర్టీఐ ద్వారా సమాచరం అడిగితే.. ఏపీకి మూడు రాజధానులంటూ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్రెడ్డికి కేంద్రం సమాధానమిచ్చింది. అయితే.. కేంద్రం సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్ శాస్త్రి హోంశాఖకు కంప్లయింట్ చేశారు కూడా. దీంతో ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని ఓ లేఖను కేంద్ర హోంశాఖ పంపింది.